నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ కృషి..

39

తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సి,ఎస్టి విద్యార్థులకు 50 కోట్ల రూపాయలతో విద్యా,ఉపాధి అవకాశాలకై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు తెలంగాణ ఎస్సి,ఎస్టి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. టెక్ నాలెడ్జ్ సంస్థ డైరెక్టర్ దండు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సి,ఎస్టి విద్యార్థులకు నిర్వహిస్తున్న క్యాంపస్ ట్రైనింగ్ ప్రోగ్రాం వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిరుపేద వర్గాలైన ఎస్సి,ఎస్టిల విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా డిగ్రీ పూర్తయి టెక్ నాలెడ్జ్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని వివిధ కంపెనీలలో రిక్రూట్ అయిన ఎస్సి,ఎస్టి విద్యార్థులకు సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ ఎస్సి,ఎస్టి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు ఆనంద్,రమేశ్, టెక్ నాలెడ్జ్ సంస్థ నిర్వాహకుడు సాయి తదితరులు పాల్గొన్నారు.