టూరిజం డాక్యుమెంటరీ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

114
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశం కొండపోచమ్మ సాగర్ పై రూపొందించిన టూరిజం ప్రచార వీడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను, ఆకర్షణీయమైన ప్రదేశాల ప్రత్యేకతలపై షార్ట్ ఫిల్మ్ లను రూపొందించి వాటిని సోషల్ మీడియాలోను, టూరిజం ప్రచార, సమాచార కేంద్రాల ద్వారా పర్యాటకులకు చేరేలా ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో పర్యాటకులు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో ఆంక్షలు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. దేశీయంగా ఉన్న పర్యాటక ప్రదేశాల వివరాల్ని ఈ వీడియోల ద్వారా పర్యాటకులకు చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, మహబూబ్ నగర్ జిల్లా DCCB బ్యాంక్ వైస్ ఛైర్మన్ కొరమోని వెంకటయ్య, MBNR మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ కుమార్, వివిధ పత్రికల ఫోటో గ్రాఫర్ లు రజనీకాంత్, హరి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -