ఆర్టికల్‌ 370 రద్దు…విచారణ నవంబర్ 14కు వాయిదా

438
supreme court
- Advertisement -

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ ప్రారంభమైంది. పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీం. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 14కు వాయిదా వేసింది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను విచారించడానికి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైన సంగతి తెలిసిందే. నేటి నుంచి పిటిషన్లపై విచారణ జరపనుంది సుప్రీం.

ఆర్టికల్‌ 370ని రద్దుచేయడంతోపాటు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి రానున్నాయి.

- Advertisement -