సావిత్రి రేర్‌ ఫోటోస్‌..మీకోసం

686
- Advertisement -

తెలుగు తెరపై ఆమె ఓ నటశిఖరం..మరపురాని అభినేత్రి…చరిత్రలో చెరగని సంతకం! చెదరని జ్ఞాపకం!..ఆమె మన తెలుగింటి ప్రియపుత్రి సావిత్రి. కళ్ళతోనే మాట్లాడే కళాకారిణి…ముఖంలోనే అన్ని భావాలూ పలికించే ‘మహానటి’..అందుకే మూడున్నర దశాబ్దాల క్రితం ఈ నటశిఖరం నెలకొరిగినా దక్షిణాది ప్రజల హృదయాల్లో ఇంకా చిరంజీవిగానే బ్రతికుంది.

ఆమె జీవితం జ్ఞాపకాల తేనెతుట్టె!మలుపులు… మెరుపులు… గెలుపులు… ఓటములు.. విషాదాలు…వెరసి… ఆమె జీవితమే ఓ సినిమా! పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే ఆమె ఎన్నో మరుపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించి వారిచేత శభాష్ అనిపించుకున్నారు సావిత్రి. ఆమె నటనకు ఎన్నో అవార్డులు జాలు వారాయి. అందుకే సావిత్రి గురించి తెలిసిన,దగ్గరిగా చూసినవాళ్లు ఇప్పటికి,ఎప్పటికి ఎన్నటికీ మర్చిపోలేరు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె నైజం. ఎన్ని సినిమాల్లో నటించిన ఆమె సావిత్రి పట్టుదల కలిగిన వ్యక్తి. దీనివల్ల కొన్ని సార్లు ఆమె నష్టపోయారు. నటిగా మాత్రం ఎప్పుడూ గెలిచారు. మహానటిగా కీర్తింపబడ్డారు. 45 సంవత్సరాల వయసులో సుమారు 300 చిత్రాల్లో నటించి, తెలుగువారి గుండెల్లో నిలిచిన సావిత్రి స్థానాన్ని మరెవరూ అందుకోలేరు.

చీకటి ఉంటేనే వెలుగుకు విలువ. నష్టం ఉంటేనే లాభానికి మన్నన. ఇదే జీవితసారం. ఇందుకు సావిత్రి జీవితం అసలు సిసలైన మచ్చుతునక. ఆ మహానటి జ్ఞాపకార్థం రేర్ ఫోటోస్ మీకోసం..

- Advertisement -