జబర్ధస్త్ కు రోజా గుడ్ బై..మరీ నాగబాబు?

345
Nagababu Roja

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగు కామెడీ షోలలో అన్నికంటికన్నా టాప్ రేటింగ్ లో జబర్దస్త్ నడుస్తుంది. అయితే ఈషో ఇంత పాపులర్ కావడానికి జడ్జస్ కూడా అంతే ముఖ్యమని చెప్పుకోవాలి. ఈషోకు మొదటి నుంచి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు రోజా, నాగబాబు. గత ఐదు ఏండ్లుగా వీరిద్దరూ ఈషోకు జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటివలే జరిగిన ఎన్నికల్లో రోజా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఆమెకు మంత్రి పదవి రావడం ఫక్కా అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ మహిళా రాజకీయ నాయకుల్లో రోజానే కీలకమైన వ్యక్తి. పైగా జగన్ కి బాగా సన్నిహితురాలు కూడా. కాబట్టి జగన్ పెద్ద బాధ్యతనే ఈమె బుజాలపైనా వేసే అవకాశం ఉంది. దీంతో ఆమె ఈషోను మానేసి పూర్తీగా రాజకీయాల్లో దృష్టి సారించనున్నారని తెలుస్తుంది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీ గా పోటీ చేసిన నాగబాబు ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

దీంతో ఇన్ని రోజులు జబర్ధస్త్ కు హాజరుకాలేకపోయిన ఆయన త్వరలోనే తిరిగి జబర్ధస్త్ కు రావాలని అనుకుంటున్నారట. ఇక రోజా స్ధానంలో సీనియర్ కమెడీయన్ ఆలీని తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆలీ రెండు ఎపీసోడ్ లకు జడ్జ్ గా కూడా చేశారు. మంత్రి అయిన తర్వాత కూడా రోజా జబర్ధస్త్ లో ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.