విదేశీ కరెన్సీ పట్టివేత…

74
currency

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్ళేందుకు వచ్చిన మహమ్మద్ నజీర్ అనే వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు.మహమ్మద్ నజీర్ ఎయిర్ అరేబియా విమానానికి టికెట్ బుక్ చేసుకుని షార్జా వెల్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన అతని భ్యాగేజ్ ను చెకింగ్ చేసిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు. అందులో అక్రమంగా తరలిస్తున్న సౌది రియాల్ భయటపడింది. కరేన్సీని స్వాదీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ కరేన్సీ విలువ 34.49 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.