కట్టప్ప కత్తికి రెండు వైపులా పదును..!

229
Sathyaraj apologises for anti-Kannada comments
- Advertisement -

కన్నడిగుల ఆందోళనతో కట్టప్ప(సత్యరాజ్‌) దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై బాహుబలి కట్టప్ప  క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు.

ఇదే సమయంలో తన క్షమాపణల వల్ల తమిళనాడులో సినిమాకు వ్యతిరేక పరిస్థితులు తలెత్త వచ్చన్న ఆలోచనతో, అటు తమిళ తంబీలనూ ప్రసన్నం చేసుకునేలా కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించి, తన కత్తికి రెండు వైపులా పనునుందని ఆయన చెప్పకనే చెప్పారు.

తమిళ ప్రజలు తన క్షమాపణలను అర్థం చేసుకోవాలని, కావేరీ నీటి కోసం తన పోరాటం సాగుతుందని అన్నారు. తమిళ ప్రజల తరఫున వాదనలు వినిపించడాన్ని ఇష్టపడతానని చెప్పి, తమిళులకు ఆగ్రహం కలుగకుండా చూసే ప్రయత్నాలు చేశారు. గతంలో ఈ అంశంపై కన్నడ, తమిళ నటులు పరస్పరం వ్యతిరేక విమర్శలు గుప్పించుకున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే, కన్నడ నటుల వ్యాఖ్యలకు నిరసనగా తాను మాట్లాడానని, అది కూడా ఇటీవలి కాలంలో కాదని చెప్పుకొచ్చారు.

బాహుబలి విడుదల తేదీ దగ్గర పడటం, కన్నడనాట థియేటర్లను బుక్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు భయపడుతూ ఉండటంతోనే, అటు నొప్పింపక, తానొవ్వక అన్న చందంలో సత్యరాజ్ మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూనే, క్షమాపణలూ చెప్పారు. దీంతో ఇప్పటికైనా కన్నడలో కట్టప్ప వివాదం సద్దుమనుగుతుందో లేదో చూడాలి.

- Advertisement -