టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
సర్కారు వారి పాట చిత్రం ఇప్పటికే దుబాయ్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మరో షెడ్యూల్‌కు సిద్ధమైంది. ఆగస్ట్ 9న మహేష్ బర్త్‌డే కాబట్టి ఆ రోజు చిత్రం నుండి సర్‌ప్రైజ్ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట. ఈ టీజర్ అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని అందిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.