డోర్ టు డోర్ ప్రచారంలో మంత్రి పువ్వాడ..

38
Minister puvvada ajay

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపంచాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్, 37వ డివిజన్, 42వ డివిజన్, 44వ డివిజన్లలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. పట్టభద్రులను స్వయంగా కలిసి ఓటు అభ్యర్దించారు.

మొదటి ప్రాధాన్యత ఓటుతో టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలిచే విధంగా తమ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ప్రచారంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు తోట ఉమారాణి, రుద్రాగని శ్రీదేవి, నాయకులు వీరభద్రం, ఉపేందుర్, పోట్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.