‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌ డేట్ పోస్టర్‌..

366
mahesh babu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.

mahesh

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర బృందం. సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుందని పోస్ట‌ర్‌లో తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కుర‌వ‌డం ఖాయమ‌ని అభిమానులు చెబుతున్నారు. ఇక చిత్రానికి సంబంధించి ప్ర‌తి సోమవారం సాంగ్ విడుద‌ల చేస్తుండ‌గా, ఈ సోమవారం హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ విడుద‌ల కానుంది. ఈ సాంగ్‌కి సంబంధించి రష్మిక టిక్ టాక్ వీడియో చేసిన సంగ‌తి తెలిసిందే. ఇ మూవీలో దేవి శ్రీ సంగీతం ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తుంది.