తన బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన సానియా..!

220
Sania Mirza
- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్,టాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్లో అయితే వరుస బయెపిక్స్‌తో దుమ్ములేపుతున్నారు. ఇదివరకే వచ్చిన ధోనీ, మేరీకోమ్‌, మిల్కాసింగ్‌, ఇలా పలువురి జీవిత కథలతో తెరపై అభిమానుల్ని కనువిందు చేయగా.. కొత్తగా మరో బయోపిక్‌ రాబోతుంది. ఇప్పుడు భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్‌ కూడా తెరపైకి రానుంది.

Sania Mirza

ఈ మూవీపై గత కొంత కాలంగా వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో సానియా తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ బయోపిక్‌ ఒప్పందంపై సంతకం చేసినట్లు శుక్రవారం సానియా స్వయంగా వెల్లడించింది. ‘‘ చాలా కాలంగా నా బయోపిక్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఒప్పందం కుదిరింది. ఇది నా స్టోరీ కాబట్టి నా ఇన్‌పుట్స్‌ చాలా కీలకం. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అని సానియా తెలిపింది.

దీనికి సంబంధించి నటులు, రచయితలు ఎవరూ అన్నది ఇంకా ఖరారు కావల్సివుంది. ఇకపై ఈ బయోపిక్‌ విషయంలో పరస్పర సహకారంతో ముందుకు వెళతాం’’ అని సానియా మీర్జా తెలిపింది. ఈ చిత్రానికి ఇటివల ‘ఉరీ’ సినిమాతో హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ రోనీ స్క్రూవాలా దర్శకత్వ బాధ్యతను వహించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

- Advertisement -