దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత కూడా ఒకరు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈఏడాది వరుస సినిమాలతో బిజీగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈఏడాది ఆమె నటించిన రంగస్ధలం, మహానటి, అభిమన్యుడు సినిమాలు బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి.
ప్రస్తుతం సూపర్ డిలక్స్, సీమ రాజా అనే తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో కూడా నాగచైతన్యతో ఓ సినిమా చేయనుంది. నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పెళ్లి చేసుకున్నాక సమంత సినిమాలకు దూరంగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అందుకు విరుద్దంగా ఇప్పడు ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని సమాచారం. అందుకే సమంత కొత్త సినిమాలు ఒప్పకొవడం లేదట. గతంలో ఒప్పుకున్న సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.
2019లోపు సినిమాలు అన్ని పూర్తి చేసి పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలని అనుకుంటుందట. గత కొద్ది రోజుల క్రితం సమంత ఇచ్చిన ఓ ఇంటర్యూలో తెలిపిన వివరాల ప్రకారం ఇప్పట్లో సినిమాలు మానేసే ఆలోచన లేదని చెప్పింది. పిల్లల కోసమే సమంత ఈనిర్ణయం తీసుకుందని చాలా మంది అనుకుంటున్నారు. పిల్లల గురించి తాను చైతన్య ఒక టైం అనుకున్నామని..ఆ సమయం వచ్చే దాకా కెరీర్ గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇక తను సినిమాలు చేయట్లేదు అని వస్తున్న వార్తల పట్ల సమంత ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.