కళ్యాణ్ దేవ్.. ‘విజేత’ సెన్సార్ పూర్తి

248
Vijetha
- Advertisement -

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

kalyan dev

నటీనటులు:కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా,సాంకేతిక నిపుణులు:కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి,నిర్మాత: రజిని కొర్రపాటి,సాయి కొర్రపాటి ప్రొడక్షన్,ప్రెజెంటర్: సాయి శివాని,కెమెరామెన్: కె.కె.సెంథిల్,సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్,సాహిత్యం: రెహమాన్ రామజోగయ్య శాస్త్రి,ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ,స్టంట్స్: జాషువ,పీ. ఆర్.ఓ: వంశీశేఖర్.

- Advertisement -