అక్కినేని సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. సామ్ ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి.
కాగా..సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ అక్కినేని కోడలు ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ -2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇది సామ్ కు తొలి వెబ్ సిరీస్. కలిసొస్తే వెబ్ సిరీస్ లలోనే సమంత సత్తా చాటే అవకాశం ఉంది. అలాగే సొంతంగా వెబ్ సిరీస్ ల నిర్మాణం.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం అంటూ చాలానే ప్లాన్స్ ఉన్నాయట సమంతకి. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు.