మామకు థ్యాంక్స్ చెప్పిన సమంత…

79
samantha

తన మామ అక్కినేని నాగార్జునకు థ్యాంక్స్ చెప్పింది సమంత. నాగ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో గతవారం హోస్ట్‌గా వ్యవహరించింది సమంత.వ్యాఖ్యాత‌గా సమంత స‌క్సెస్ అయిన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది సామ్‌.

బిగ్‌బాస్ స్టేజీ మీద హోస్ట్‌గా చేస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. మామ ఇచ్చిన బాధ్య‌త‌తో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాను.యాంక‌రింగ్ అనుభ‌వం లేదు, తెలుగుపై ప‌ట్టు లేదు, బిగ్ బాస్ షో ఒక్క‌టి కూడా చూడ‌లేదు. అయిన న‌న్ను న‌మ్మి నాకు హోస్టింగ్ బాధ్య‌త‌ను అప్ప‌గించిన మామ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.ద‌స‌రా మ‌హా ఎపిసోడ్ త‌ర్వాత మీ నుండి వ‌స్తున్న ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు అని స‌మంత పేర్కొంది.