నెటిజన్లకు సమంత వార్నింగ్‌..

244
Samantha Strongly-Worded Message on Instagram
- Advertisement -

పెళ్లయినప్పటి నుంచి సమంత చాలా బోల్డ్ అయిపోతున్నట్టు కనిపిస్తోంది. తాను చేయాలనుకున్నది చాలా ధైర్యంగా చేసేస్తోంది. అంతకుముందెప్పుడు లేని విధంగా… ఇప్పుడు బికినీలో దర్శనమిస్తోంది. అది చూసి కొందరు అభిమానులు పండగ చేసుకుంటే… మరికొందరు మాత్రం ఏంటీ సామ్ ఈ అవతారం అని బాధపడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అక్కినేని వారి కోడలు, సినీ న‌టి సమంత తాను బికినీ వేసుకుని ఫొటో దిగి దాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌మంత ఇలా షాక్ ఇచ్చిందేంటంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. కొంద‌రు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పెళ్లైన స్త్రీ ఇలా బికినీ వేసుకుని ఫొటోలు దిగడ‌మే కాకుండా దాన్ని పోస్టు చేయ‌డం ఏంటని అంటున్నారు.

Samantha Strongly-Worded Message on Instagram

మ‌రికొంద‌రైతే మ‌రిన్ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో స‌మంత మ‌రోసారి సోష‌ల్ మీడియాలో మ‌రో పోస్ట్ చేసి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. తానిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలని, ఎందుకంటే త‌న‌ గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమీ లేదని ఆమె పేర్కొంది. త‌న‌ రూల్స్ తాను రాసుకుంటాన‌ని, అభిమానులు త‌న నియమాలు రాయడం కాదని, ఎవ‌రి రూల్స్ వాళ్లు రాసుకోండని కాస్త ఘాటుగా ట్వీట్ చేసింది.

- Advertisement -