హీరోయిన్ సమంత పెళ్లికాక ముందు చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం అయిన విషయం తెలిసిందే. పుడ్ ఎలాగో సెక్స్ కూడా అలాగే అంటూ అప్పట్లో సమంత చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ మొత్తం షేకయింది. సమంత ఏంటి? ఇలాంటి కామెంట్స్ చేయడమేమిటి? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు సమంత ఓ ఉన్నతమైన కుటుంబానికి కోడలిగా బాధ్యతలని నిర్వహిస్తోంది. పెళ్లయిన వెంటనే మళ్లీ షూటింగ్‌లకు వచ్చేసిన సమంత ఇప్పుడు షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో చేసిన ఓ పోస్ట్ సంచలనం అవుతోంది.
అదృష్టం కోసం వేచి చూడకుండా.. పోరాడటంపై దృష్టి పెట్టండి. పోరాటంపై నమ్మకం పెడితే అదృష్టం అదే వచ్చేస్తుంది అంటూ ఎదుటివారికి స్ఫూర్తి నింపే మెసేజ్‌ని సమంత పోస్ట్ చేసింది. బ్యాగ్ పట్టుకుని ప్రయాణం చేస్తున్నట్లుగా ఉన్న పిక్‌తో పాటు ఈ మెసేజ్‌ని సమంత పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి సుమారు 6 లక్షల లైక్స్ రావడం విశేషం. ప్రస్తుతం సమంత రామ్‌చరణ్‌తో కలసి ‘రంగస్థలం’లో నటిస్తోంది. ‘మహానటి’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.