సమంతను దగ్గర ఉండి మరీ చూసుకుంటాడట

70
- Advertisement -

సినిమాలకు ఆరు నెలల పాటు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. డివోషనల్ మోడ్‌లోకి వెళ్ళింది. యోగా గురువు సద్గురు నిర్వహించిన యోగా కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో వెల్లడించింది. ”ఎలాంటి ఆలోచనలు, కదలికలు లేకుండా కూర్చోవడం అసాధ్యం అనిపించింది. ధ్యానం అనేది ప్రశాంతతకు మూలం అని ఈరోజే తెలిసింది” అంటూ సమంత ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. సమంతలో చాలా మార్పులు వచ్చాయని ఆమె అభిమానులు మేసేజ్ లు పెడుతున్నారు.

ఒంటరిగా ఉండటం ఎంతో కష్టంగా ఉంటుందని.. ప్రస్తుతం తమ హీరోయిన్ ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంది అని సామ్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. అందుకే సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రపంచంలో సేదతీరుతున్నారని.. కానీ, ఆమె త్వరగా ఆ మోడ్ లో నుంచి బయటకు వచ్చి.. మళ్లీ ఫ్రెష్ గా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మరో నెటిజన్ అయితే ఏకంగా సమంత ఆనందం కోసం తాను ఏమైనా చెస్తాను అని, ఆమె అనుమతి ఇస్తే.. ఆమెను తాను దగ్గర ఉండి మరీ చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి సమంత పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. సమంత మాత్రం ఇవేమీ పట్టించకోకుండా నిన్న రాత్రి కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్‌లో వెళ్ళింది. ఆమె ప్రస్తుత స్థితిని బట్టి.. ధ్యానమార్గంలో ప్రయాణిస్తున్న సమంతకు ఓ కొత్త ప్రశాంతత దక్కినట్లు ఉంది. తాజాగా గెలాటో మార్నింగ్ అంటూ అభిమానులకు విషెస్ చెబుతున్నారు. ఇక ఈ మేరకు పిల్లి పిల్లతో బెడ్ మీద పడుకుని చిరునవ్వులు చిందిస్తున్న సమంత ఫొటో అభిమానులకు తెగ నచ్చేసిందట.

- Advertisement -