మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం:హరీష్‌

34
- Advertisement -

మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని చెప్పారు మంత్రి హరీష్‌ రావు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు…గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్ అన్నారు. హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు..మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కిం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త అన్నారు.

కాంగ్రేస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి…దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే అన్నారు.ఈ బడ్జెట్ లో 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినము…ఒక్క సంవత్సరం లో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదన్నారు.మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉందని…రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నామన్నారు.

మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారు..సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబులు ఇచ్చి ఫైలట్ చేశారు ఇప్పుడు ఆ అమ్మయి నెలకు 5 లక్షలు సంపాదిస్తుందన్నారు.ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు…దేశంలో మైనార్టీ అమ్మయిలు ఎక్కువగా చదువుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

Also Read:బాధ్యతలు స్వీకరించిన వేద రజనీ..

అమ్మాయిల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నమన్నారు.నీట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉర్దూలో నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే..20 లక్షలు ఓవర్సిస్ స్కాలర్ షిప్ ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నమన్నారు.రంజాన్ గిఫ్టులు, అజ్మీర్ దర్గా లో 5 కోట్లు కేటాయించి ఒక భవనం నిర్మిస్తున్నారు..దేశంలో అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్నారు.రంజాన్ పండుగ సందర్భంగా ధవాత్ ఏ ఇఫ్టర్ అన్ని జిల్లాలో ఇస్తున్నాం…ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు.

- Advertisement -