మంగ్లీ పాటకు సద్గురు,సమంత డ్యాన్స్..

307
Samantha
- Advertisement -

సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి అక్కినేని సమంత కాలు కదిపారు.గురువారం శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ శివరాత్రి మహోత్సవాలను వేడుకను ఘనంగా నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈశా సెంటర్‌లో ఈ ఉత్సవాలకు హీరోయిన్‌ అక్కనేని సమంతి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ గాయని మంగ్లీ పాడిన పాటలకు సమంత కాలు కదిపారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది.

మంగ్లీ పాట పాడుతుంటే సద్గురు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేశారు. తాను డ్యాన్స్ చేస్తూ, అక్కడకు విచ్చేసిన అందరినీ ఉత్సాహపరిచారు. స్టేజ్ దిగి సమంత వద్దకు వెళ్లారు. డ్యాన్స్ చేయాలని ఆమెను కోరారు. అయితే, ఆమె నవ్వుతూ అలాగే ఉండిపోయారు. దీంతో, సమంత చేతిని ఈయన చిన్నగా గిల్లారు. ఆ తర్వాత ఆయన సూచన మేరకు అక్కడున్న వారితో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. సద్గురుకు ఎంతోమంది సెలబ్రిటీలు ఫాలోయర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. వారిలో సమంత కూడా ఒక్కరు.

- Advertisement -