ఇది నా డ్రీమ్‌ రోల్‌- సమంత

47
samantha

సమంత అక్కినేని టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌, గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇవ్వగా, అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం మీడియాతో హీరోయిన్ సమంత మాట్లాడతూ.. ‘‘ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నాకిష్టమైన పాత్రలో నటించలేనేమోనని! నటిగా నా ప్రయాణం ప్రారంభమైనప్పట్నుంచీ ‘మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి?’ అని అడిగితే… ‘రాకుమారి తరహా పాత్రలో చారిత్రక చిత్రం చేయాలనుంది’ అని చెప్పేదాన్ని. ఇప్పుడు చేస్తున్నా’’ అన్నారు.

‘‘ఇప్పటివరకూ దాదాపు 50 చిత్రాలు చేశా. వైవిధ్యమైన పాత్రల్లో నటించా. రొమాంటిక్‌, థ్రిల్లర్‌, యాక్షన్‌ పాత్రలు, ‘ఫ్యామిలీమాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో విలన్‌గా… అన్నీ చేశా. అయితే, నా డ్రీమ్‌ రోల్‌లో నటించే అవకాశాన్ని గుణశేఖర్‌, ‘దిల్‌’ రాజు ఇచ్చారు. పదేళ్ల కెరీర్‌లో నేనందుకుంటున్న అతిపెద్ద, గొప్ప బహుమతి ఇది. వందశాతం మనసుపెట్టి పని చేస్తా. కష్టపడతా. ఈ పాత్ర చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అని సమంత సంతోషం వ్యక్తం చేశారు.