ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్‌కు సర్వం సిద్ధం..

348
MLC vote counting
- Advertisement -

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్‌కు సర్వం సిద్దం అయింది. నల్లగొండ పట్టణంలోని వేర్ హౌసింగ్ గౌడన్స్‌లో కౌటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8 హాల్స్ లో ఒక్కో హాల్‌కి 7 టేబుళ్ళ చొప్పున మెత్తం 56 టేబుల్స్ ఏర్పాటుచేశారు. ఒక్కో టేబుల్‌కు కౌటింగ్ సుపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు. ఒక్కో హాల్‌కు అసిస్టింట్ రిటర్నింగ్ అధికారుల్ని భాద్యులుగా నియమించారు. ఆర్ ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ రంఘనాద్ లు కౌటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.

మార్చ్ 14 న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజవర్గంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది.. 5,05,565 ఓట్లకు గాను 3,86,320 ఓట్లు పొలయ్యాయి. ఇప్పటికే మాక్ కౌటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఎక్కడా పొరపాట్లు లేకుండా కౌటింగ్‌కు పకడ్భంది ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఓటింగ్ కాబట్టి కౌటింగ్ కూడా సుదీర్ఘంగా జరగనుంది. అందుకు అనుగుణంగా 24 గంటలు రౌండ్ దీ క్లాక్ నిరంతరాయంగా కౌటింగ్ నిర్వహించేందుకు 4 వేల సిబ్బందిని షిఫ్ట్ ల వారిగా నియమించారు. ఇక బుధవారం ఉదయం అభ్యర్దులు, కౌటింగ్ ఏజేంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి వారి సమక్షంలో 731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లను కౌటింగ్ హాల్స్ కు తరలిస్తారు. వారి అనుమతి తీసుకోని బ్యాలెట్ బాక్స్ లను ఒపెన్ చేసి పోలైన్ అన్ని బ్యాలెట్ పేపర్ లను కలబోసి, 25 బ్యాలెట్ పేపర్ లను ఒక బండీల్‌గా కడతారు.ఆతర్వాత ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున వాటిని పంపిణీ చేసి వాటిల్లో చెల్లిన ఓట్లను, మురిగిన ఓట్లను వేరు చేస్తారు. మెత్తం చెల్లుబాటైన ఓట్లను ఫైనలైజ్ చేసి గెలుపుకు కవాల్సిన కోటాను నిర్ణయించి ఆ తర్వాత మెదటి ప్రియార్టీ ఓట్లను లెక్కించే ప్రక్రీయను స్టార్ట్ చేస్తారు.

56 టేబుల్స్ లలో ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్లను లెక్కంచనున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మెదటి విడుత ఫలితం రానుంది. ఇక మెదటి ప్రియార్టీ ఓట్ల లెక్కింపులో గెలుపుకు నిర్ణయించిన కోటాను ఏ అభ్యర్దికి చేరుకోక పోతె ఎలిమేషన్ పద్దతిలో అతి తక్కవ ఓట్లు వచ్చిన అభ్యర్దిని ఎలిమినేషన్ చేసి అతడికి పడ్డ ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్దికి పడ్డయో లెక్కించి వాటిని ఆ సంభంధిత అభ్యర్దికి బదలాయింపు చేస్తారు. ఇలా తక్కవ ఓట్లు వచ్చిన అభ్యర్దుల్ని ఒక్కోక్కరిని ఎలిమినేషన్ చేస్తూ కోటాకు రావల్సిన ఓట్లు వచ్చేంత వరకు కౌటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా కోటాను ముందుగా ఏ అభ్యర్ది క్రాస్ చేస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు.

ఇక ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరిగింది కాబట్టి.. కౌటింగ్ కూడా అలాగే భారీ క్రతువుతో కూడుకోని ఉన్నది. 4వేల సిబ్బంది మరో వెయ్యి మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నరు. రౌండ్ దీ క్లాక్ 24 గంటలు నిరంతరాయంగా కౌటింగ్ జరుగుతుంది కాబట్టి సిబ్బందికి షిఫ్ట్ ల వారిగా విధుల్ని అప్పజెప్పారు. ఈ కౌటింగ్ ప్రదేశంలో 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు..సీఆర్ పీఎఫ్ బలగాల్ని మోహరించారు.ఎన్నికల నిభంధనల ప్రకారం కౌటింగ్ పూర్తి అయ్యేంత వరకు 144 సెక్షన్ విధించారు.లిక్కర్ షాప్ లను మూసి వేశారు. రేపు ఉదయం కౌటింగ్ ఏజెంట్ల నియామకం పూర్తైన తర్వాత స్ట్రాంగ్ రూం తెరిచి బ్యాలెట్ బాక్స్ లను కౌటింగ్ హాల్స్ లోకి తెస్తారు. ఉదయం 8 గంటల నుంచి కౌటింగ్ ప్రక్రియ మెదలవుతుంది.

- Advertisement -