తెలంగాణ చేనేత ప్రచారకర్తగా సినీనటి సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘వొవెన్ 2017’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సమంత తనకు కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి హాజరయ్యారు. చైతు సమంత పక్క పక్కనే కూర్చుని కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆకర్షరణగా నిలిచారు.
వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ ఈవెంట్ లో సమంత ఒక సాదా చేనేత చీరను ఫ్యాషన్ గా చుట్టుకొని వచ్చి అందరిని వావ్ అనేలా చేసింది. పోచంపల్లి చీరను పొలం గట్టు మీద ఎంకి పాటలో మరదలు పిల్లలాగా చుట్టి నల్లని జాకెట్ వేసుకొని మెరిసే జుంకీలు పెట్టుకొని తన లేత అందాలుతో ఇలా ఫోజ్ ఇచ్చింది. మన పాత పద్దతులకు కొత్త అందం అద్ది సాదాతనాన్నికి మరింత సోయగం వచ్చినట్లు ఉంది సమంతను చూస్తుంటే. మన ఆచారాలు ఎప్పటికీ అంతంకావు అవి ఇలా రూపాలు మారుతూ ఉంటుంది అంతే ఇక్కడ సమంతను చూస్తే అలానే అనిపిస్తుంది.
అంతేకాదు నాగచైతన్య చేనేత వస్త్రంతో తయారుచేసిన షేర్వాణి ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫొటోను సమంత పోస్ట్ చేస్తూ.. ‘నా ప్రేమ, జీవితమైన చైకి ధన్యవాదాలు. నువ్వే నా బలం’ అని పేర్కొన్నారు. నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6న గోవాలో జరగనుంది. మూడురోజుల పాటు హిందూ, క్రైస్తవ సంప్రదాయంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య ‘యుద్ధం శరణం’ చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క సమంత ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘రాజుగారి గది-2’ చిత్రాల్లో నటిస్తున్నారు.