షాకింగ్‌.. విడిపోతున్నట్లు ప్రకటించిన నాగ చైతన్య-సమంత

86
samantha

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య,సమంత ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. భార్య భర్తలుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ డైవ‌ర్స్ స్టేట్మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇద్ద‌రం ఒక‌రికి ఒక‌రు దూరం ఉండాల‌నుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. స‌మంత‌తో సంప్ర‌దింపుల త‌ర్వాత ఇద్ద‌రం వేరుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని నాగ చైత‌న్య త‌న ట్వీట్‌లో తెలిపారు. త‌మ కెరీర్‌ల‌పై దృష్టి పెట్టాల‌నుకుంటున్న‌ట్లు నాగ్ చెప్పారు.

దాదాపు ద‌శాబ్ధ కాలం పాటు త‌మ మ‌ధ్య స్నేహం కొన‌సాగింద‌ని, అదే త‌మ మ‌ధ్య బంధాన్ని బ‌ల‌ప‌రిచిన‌ట్లు చైత‌న్య తెలిపాడు. అది ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిద‌న్నాడు. క్లిష్ట త‌ర‌మైన స‌మయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా స‌హ‌క‌రించాల‌ని.. త‌మ‌కు ప్రైవ‌సీ ఇవ్వాల‌ని చైతూ,సామ్‌ త‌మ ట్వీట్‌ ద్వారా వేడుకున్నారు.