సోషల్‌ మీడియాలో టాలీవుడ్ భామల హంగామా…

792
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలుకొన్ని సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలు ఓ పార్టీకి సంబందించినవి. అయితే అందులో ఉన్న హీరోయిన్స్‌ ఎవరో కాదు..సమంత, తమన్నా, అదితిరావు హైదరి, అలాగే..అక్కినేని అమల కూడా.

Samantha_Tamannaah_Amala-Latest-stills-1

ఓ పార్టీలో ఈ టాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. నిన్న రాత్రి జరిగిన పార్టీ చాలా సరదాగా జరిగిందని సమంత, తమన్నాలు తమ ట్వీట్లలో తెలిపారు. చక్కటి విందు ఏర్పాటు చేసిన పింకీ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ‘రా మ్యాంగో’ పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తన ట్వీట్ లో తమన్నా తెలిపింది.

Private Party అంతేకాకుండా, చాలా రోజుల తర్వాత అమల మేడమ్, సమంత, అదితి లను కలవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొంది తమన్నా . ఇక ఈ పార్టీ ఏర్పాటు చేసిన సంజయ్ గర్గ్, పింకీ రెడ్డికి అదితి హైదర్ ధన్యవాదాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు పోస్ట్ చేశారు.

- Advertisement -