విజయ్‌ దేవరకొండతో బేరసారాలు…

173
producers wants vijay devarakonda

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ హిట్‌ తో అప్పట్లో ఓ రేంజ్‌ లో ఉన్న యంగ్‌ హీరో. అయితే రీసెంట్ గా ‘గీత గోవిందం’ తో మరోసారి హీట్‌ కొట్టి సంచలన విజయాన్ని సాధించాడు. ఇక ఈ సినిమా వసూళ్ళు ఈ యంగ్‌ హీరోని పెద్ద స్టార్‌ రేంజ్‌ లో నిలిపాయి. కాగా.. ఈ యంగ్‌ హీరో చేతిలొ ఇప్పుడు మూడు ప్రాజెక్టులున్నాయి.

vijay devarakonda

ఇదిలా ఉంటే..ఇప్పుడు విజయ్‌ ని నిర్మాతలు వదలడంలేదు. తన నెక్ట్స్‌ సినిమాలని తమ బ్యానర్లో చెసిపెట్టమని విజయ్‌ చుట్టూ తిరుగుతున్నారని టాక్‌. మరికొందరు విజయ్ సన్నిహితుల ద్వారా బేరసారాలు కూడా జరుపుతున్నారని సమాచారం.

యువ కథానాయకులలో ఒక్క నాని మినహా మిగతావాళ్లు ఎవరూ కూడా 5 కోట్ల పారితోషికం దాటలేదు. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం 8 నుంచి 10 కోట్ల వరకూ ఇవ్వడానికి సైతం కొంతమంది నిర్మాతలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ మూవీస్‌ ఎవరి బ్యానర్ల లో రానున్నాయో.