సాల్ట్ టీ ఎప్పుడైనా తాగారా..ఎన్ని లాభాలో?

12
- Advertisement -

సాధారణంగా ప్రతి ఒక్కరికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం పూట లేదా కాస్త తలనొప్పిగా ఆనింపించినప్పుడు, లేదా ఒత్తిడి అధికమైనప్పుడు కాస్త టీ తాగి రిలీఫ్ పొందుతూ ఉంటారు. టీలో చాలానే రకాలు ఉన్నాయి. మసాలా టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, రోస్ టీ.. ఇలా చాలానే రకాలు ఉన్నాయి. వీటిలో వారి వారి అభిరుచికి తగినట్లుగా టీ ని సేవిస్తూ ఉంటారు. అయితే మీరెప్పుడైనా సాల్ట్ టీ తాగారా ? ఏంటి సాల్ట్ టీ కూడా ఉందా ? అంటే అవునండి సాల్ట్ టీ కూడా ఉంది. మనం రోజు సేవించే టీలో షుగర్ కు బదులు కొద్దిగా సాల్ట్ వేసుకొని సేవిస్తే సాల్ట్ టీ గా మారిపోతుంది. దీనిని తాగడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఎలక్ట్రో లైట్స్, ఫ్లూయిడ్స్ లను బ్యాలెన్స్ చేస్తుంది. .

మైగ్రేన్ సమస్య అధికంగా ఉన్నవారు ప్రతి రోజు సాల్ట్ టీ తాగితే.. ఇందులోని సోడియం.. మై గ్రీన్ ను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఉప్పులో సహజంగానే మినరల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వేసవిలో సాల్ట్ టీ తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇంకా సాల్టెడ్ టీ తాగితే చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. సహజంగానే వేసవిలో చర్మ సమస్యలు అధికం కాబట్టి ఈ వేసవిలో సాల్ట్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఎలాంటి చర్మ సమస్యల నుంచైనా బయట పడవచ్చు. ఇంకా ప్రతిరోజూ సాల్టెడ్ టీ తాగితే రోగ నిరోధక శక్తి మెరుగు పడడంతో పాటు జీర్ణ శక్తి కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వేసవిలో మనం డైలీ తాగే టీలో కొద్దిగా సాల్ట్ కలుపుకొని సేవిస్తే పైన పేర్కొన్న లాభాలన్నీ కలుగుతాయి.

గమనిక ; ఈ సమాచారం ఈ అవగాహన కొరకు ఇంటర్నెట్ నుంచి సేకరించి అందించడం జరిగింది. పైన పేర్కొన్న వాటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read:మోడీ – జగన్.. మధ్య వైరం?

- Advertisement -