కాంగ్రెస్‌కు సల్మాన్‌ ప్రచారం..కలిసివచ్చేనా..!

245
Salman-Khan congress

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్,ప్రధాన కార్యదర్శి ప్రియాంక ప్రచారం చేస్తుండగా సినీ గ్లామర్‌ను అద్దేందుకు సిద్ధమయ్యారు హస్తం నేతలు. ఎన్నికల రణరంగంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌తో ప్రచారం చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు సల్మాన్‌ ఖాన్‌ను తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇండోర్‌లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టేందుకు సల్మాన్‌తో ఇప్పటికే పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తారని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది తెలిపారు.

Image result for సల్మాన్ ఖాన్ కాంగ్రెస్

1965లో ఇండోర్‌లో జన్మించిన సల్మాన్‌ ముంబైకి వెళ్లక ముందు బాల్యమంతా ఇండోర్‌లోనే గడిపారు. 2009లో కాంగ్రెస్‌ ఇండోర్‌ మేయర్‌ అభ్యర్థి పంకజ్‌ సంఘవి తరపున సల్మాన్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో సల్మాన్‌ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు.

రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సినీతారలతో ప్రచారం చేయించుకోవడం కొత్తేం కాదు. సినిమా తారలు వచ్చే మీటింగ్‌లకు జనాలు విపరీతంగా వస్తారు. అందుకే తారలను తమ తరుపున ప్రచారం చేయించేందుకు రాజకీయపార్టీలు ముందువరుసలో ఉంటాయి. అయితే సల్మాన్ ప్రచారం కాంగ్రెస్‌కు ఎంతవరకు కలిసివస్తుందో వేచిచూడాలి.