సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్..

44
Saina Nehwal

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తూనే ఉంది. ఈ వైరస్‌ అంతం కాకముందే బ్రిటన్‌లో కొత్త కరోనా వేరియంట్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అందరూ ఈ కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు.కాగా, భారత ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్ ఓపెన్‌ సూపర్‌-1000 నేటి నుంచే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనాకు కరోనా పాజిటివ్ రావ‌డం గ‌మ‌నార్హం.

థాయ్‌లాండ్ లో పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు క‌రోనా పరీక్షలను నిర్వహించగా సైనాకు క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. ఈ పోటీల్లో ఆమె తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో ఆడాల్సి ఉంది. టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని సైనాను బీడబ్ల్యూఎఫ్‌ కోరింది. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం కుదేలైన నేప‌థ్యంలో దాదాపు 10 నెలల తర్వాత సైనాతో పాటు పీవీ సింధు మ‌ళ్లీ పోటీల్లో పాల్గొంటున్నారు.