నిర్మాతలకు షాక్‌.. ఆన్ లైన్‌లో విడుదలైన ‘మాస్టర్’..

34
Vijay’s Master

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈలోపే ఈ మూవీ ఆన్ లైన్‌లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. దీంతో చిత్ర నిర్మాతలు బోరుమంటున్నారు. జనవరి 13న భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదల కానుండగా, ఆన్‌లైన్‌లో మొత్తం సీన్లతో సినిమా లీక్ అయింది. ఈనేపథ్యంలో చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగ రాజు ట్విట్టర్‌ ద్వారా భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టారు.

చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ట్వీట్‌… “దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది” అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ పేర్కొన్నారు.