రానా దగ్గుబాటి ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన అందుకున్న ‘థ్యాంక్ యు బ్రదర్’ టీమ్, ఇప్పుడు క్యాస్ట్ రివీల్ పోస్టర్‌తో ముందుకొచ్చింది. ఈ పోస్టర్‌ను యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో ఒక లిఫ్ట్‌లో ప్రధాన పాత్రధారి అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంటే, ఆమె వెనకే మరో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్‌లో నిలబడి కనిపిస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు నిల్చొని, పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే, ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది.
టైటిల్ పోస్టర్ రివీల్ అయినప్పటుడు సినిమా కథకూ, లిఫ్ట్‌కూ ఏదో సంబంధం ఉందనే విషయం అర్థం కాగా, ఇప్పుడు ఆ లిఫ్ట్‌లో అనసూయ, విరాజ్ ఎడముఖం, పెడముఖం పెట్టుకొని నిల్చొని కనిపించడంతో సినిమా కంటెంట్‌పై మరింత ఆసక్తి పెరిగింది.ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్ ఫిల్మ్‌గా ‘థ్యాంక్ యు బ్రదర్’ను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు.
జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘థ్యాంక్ యు బ్రదర్’.. ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి చూస్తుంటే అసాధారణ చిత్రంగా అనిపిస్తోంది. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.షూటింగ్ పూర్తయిన ‘థ్యాంక్ యు బద్రర్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తారాగణం:అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్, వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్
సాంకేతిక బృందం:
డైరెక్టర్: రమేష్ రాపర్తి
నిర్మాతలు: మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఆర్ట్: పురుషోత్తం ప్రేమ్
మ్యూజిక్: గుణ బాలసుబ్రమణియన్
పీఆర్వో: వంశీ-శేఖర్