తొలి వన్డేలో భారత్ పరాజయం..

93
ind vs Aus

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో నేడు టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల భారీ ఛేదనలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది.

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(90: 76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(74: 86 బంతుల్లో 10ఫోర్లు) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ కోహ్లీ(21) నిరాశపరిచాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపిన కేఎల్‌ రాహుల్‌(12), శ్రేయస్‌ అయ్యర్‌(2) మిడిలార్డర్‌లో విఫలమయ్యారు. ఆతిథ్య బౌలర్ జోష్‌ హేజిల్‌వుడ్‌(3/55) భారత్‌ను ఆదిలోనే భారీ దెబ్బకొట్టాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా(4/54) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడిలో పడేశాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114), మాజీ సారథి స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో ఆకట్టుకున్నారు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.