ఆ సీన్లు చేయను…

311
Sai-Pallavis
- Advertisement -

ఫిదా సినిమాతో సాయిపల్లవి తెలుగువారి గుండెల్లో మంచి స్థానం సంపాదించింది. తనదైన శైలిలో నటిస్తూ, ఆడియన్స్ అందరిని తనకు అట్రాక్ట్ అయ్యేలా చేసుకుంది. కుర్రకారు గుండెల్ని గిల్లిగిల్లి పెట్టిన ఆమె అల్లరి అటువంటిది. తెలుగు సినిమాకి ఈ అమ్మడు అతుక్కుపోయినంత స్పీడుగా మరెవ్వరూ అతుక్కుపోలేదు కూడా. బాన్సువాడ భానుమతిగా సాయిపల్లవి చూపెట్టిన పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే! కొందరికి సొంత అక్కలా అనిపిస్తే.. మరికొందరు పెంకి మరదలుగా ఊహించుకున్నారు. పేరుకు మలయాళీ అయినా.. సాయిపల్లవి మనమ్మాయే అనుకునేంతలా దగ్గరైంది అందరికీ. ‘హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్’ అంటూ తెలంగాణ యాసతోనే ఆంధ్రాలో కూడా అదరగొట్టేసింది.

sai-pallavi

అయితే సాయిపల్లవి ఇటీవల సినిమాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. తాను గ్లామర్ పేరుతో అందాలను ఆరబోయనని, స్కిన్ షోను కొందరు గ్లామర్ అనుకుంటారని… అదే భావనతో తన వద్దకు కొందరు వచ్చారని… వారితో సినిమాలను తాను తిరస్కరించానని ఆమె తెలిపింది.తన ముఖం మీద మొటిమలు ఉన్నప్పటికీ… స్క్రీన్ మీద అందంగానే కనిపిస్తున్నాను కదా? అంటూ ప్రశ్నించింది.

sai-pallavi

తాను ఎక్కువ కండిషన్లు పెడుతున్నానని ఎవరైనా అనుకుంటే… తాను ఏమీ చేయలేనని చెప్పింది. తన దగ్గరకు వచ్చే కొంత మంది కథ గురించి ఏమీ చెప్పరని… ఫలానా హీరో పక్కన నటిస్తారా? అంటూ నేరుగా అడుగుతారని తెలిపింది. తన దృష్టిలో కథనే హీరో అని, మిగిలినవారంతా కేవలం యాక్టర్స్ మాత్రమేనని చెప్పింది. లిప్ లాక్స్ లాంటివి తనవల్ల కాదని… అలాంటి వాటికి తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరని తెలిపింది.

- Advertisement -