సౌందర్యగా సాయి పల్లవి..?

127
Sai Pallavi

గత కొంతకాలంగా భారతీయ భాషల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ మూవీ సూపర్‌ హిట్ అయ్యింది. తాజాగా మరో నటి జీవితగాథ తెరపైకి రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన ప్రముఖ కథానాయిక సౌందర్య బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Sai-Pallavi

ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయిందని అంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ బయెపిక్‌లో సౌదర్య పాత్రను మలయాళ బ్యూటీ సాయి పల్లవీ పోషించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగులో సౌందర్యలా హోమ్లీ పాత్రలు పోషిస్తూ పేరుతెచ్చుకుంటున్న సాయి పల్లవి ఇందులో సౌందర్య పాత్రకు బాగుంటుందని చిత్ర బృందం యోచిస్తున్నారట. అంతేకాదు సాయిపల్లవితో చిత్ర నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతోందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది.