‘సాహో’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

455
Sahoo
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాను యూవీ క్రియేషన్స్ సంస్ధ భారీ బడ్జెట్ తో నిర్మించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈసినిమాను ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక అందరి కళ్లు ఈమూవీ ట్రైలర్ పైనే ఉన్నాయి. సాహో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈచిత్రం ట్రైలర్ విడుదల గురించి అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈనెల 10న ఈసినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

- Advertisement -