యాక్షన్..రొమాంటిక్ థ్రిల్లర్‌..’సాహసం శ్వాసగా సాగిపో’

289
SAHASAM SWASAGA SAGIPO review
- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.ప్రేమమ్ కంటే ముందుగానే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా..తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో విడుల ఆలస్యమవుతు వచ్చింది. ఇక ప్రేమమ్‌తో హిట్‌ను సొంతం చేసుకున్న చైతు..అదే రేంజ్‌లో ఈ సినిమాతో ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం….

కథ :

రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య) ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. టిపికల్ గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలా కథ నడుస్తుండగా..ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రజనీకాంత్..లీల కలిసి వైజాగ్ నుంచి కన్యాకుమారి బైక్ ట్రిప్‌కు బయలుదేరుతారు. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. ఈ క్రమంలో వాళ్ల బైక్‌కు యాక్సిడెంట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే రజనీకాంత్ బైక్ యాక్సిడెంట్ చేయించింది ఎవరు..?లీలాను ఎందుకు చంపాలనుకుంటారు..? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..?చివరికి కథ ఎలా సుఖాంతమైందన్నది తెరమీద చూడాల్సిందే.

 SAHASAM SWASAGA SAGIPO review

ప్లస్ పాయింట్స్‌:

ప్రేమకథా చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య ఈ సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు క్లైమాక్స్, సంగీతం సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్బ్ అనిపించిన చైతూ, ఈ సారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్…స్ట్రాంగ్ విలన్ లేకపోవడం సినిమాకు మేజర్ మైనస్ పాయింట్.ప్రీ ఇంట్రవెల్ సీన్స్ కాస్త సహనానికి పరీక్షగానే అనిపించాయి. హీరోయిన్ మిస్సవటం ..అలా నాగచైతన్య నిశ్సహాయిత మీద ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ స్లోగా, ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా లేకుండా సాగింది. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి.

 SAHASAM SWASAGA SAGIPO review

సాంకేతిక నిపుణులు :

మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో అంటూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నాగచైతన్య నటన,రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ కాగా ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్…స్ట్రాంగ్ విలన్ లేకపోవడం సినిమాకు మేజర్ మైనస్ పాయింట్. మొత్తంగా సాహసం శ్వాసగా సాగిపో.. టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి బాగానే కనెక్ట్ అవుతుంది.

విడుదల తేదీ:11/11/2016
రేటింగ్:3/5
నటీనటులు: నాగచైతన్య, మంజిమా మోహన్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం : గౌతమ్ మీనన్

- Advertisement -