వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

495
- Advertisement -

మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఎల్ బి స్టేడియం నుంచి జరిగే బతుకమ్మ శకటాల ఊరేగింపును ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శ్రీమతి కల్వకుంట్ల శోభ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.అనంతరం ట్యాంక్ బండ్ బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొంటారు. అలాగే మంత్రులు, మహిళా మంత్రులు, విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు.

Bathukamma Celebrations

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు నేటీతో చివరి రోజుకు చేరాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా ఈ రోజు జరుపుకుంటున్నారు. ఇందుకోసం… తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం సరికొత్తగా దర్శనమిస్తున్నాయి.

నేటి సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు… ట్యాంక్ బండ్ మీదుగా సాగి… బతుకమ్మ ఘాట్ వరకూ కొనసాగుతాయి. అక్కడ ఆటపాటల తర్వాత… సద్దుల బతుకమ్మను నిమజ్జనంతో ఘనంగా సాగనంపనున్నారు. ఇలా తొమ్మిదో రోజు బతుకమ్మ సంబరాల్ని విజయోత్సవంలా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది.

- Advertisement -