క్యాన్సర్‌ బాధితులకు సన్ని సాయం..

354
sunny leone
- Advertisement -

గత కొద్దికాలంగా చాలా మంది సెలెబ్రిటీలు సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ తమ వంతు సహయ సహకారాలు అందిస్తున్నారు. తమకు మంచి మనసుందని చాటుకుంటూ ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్నారు. ఇది ఎంతో మంచి విషయంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ లిస్టులో మాజీ శృంగార తార, నేటి అందాల తార సన్నీలియోన్ చేరిపోయింది. క్యాన్సర్‌ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చింది.

క్యాన్సర్‌తో పోరాడేవారి కోసం తన వంతు సాయం చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సన్నీ తను వేసిన పెయిటింగ్‌ను వేలానికి పెట్టారు. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్‌ బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. తను వేసిన పెయింటింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. నా పెయింటింగ్ పూర్తయ్యింది. క్యాన్సర్‌ తో పోరాడుతున్న నిరుపేదలకు నా వంతు ఆర్థకసాయం అందచేయడం కోసం ఈ పెయింటింగ్‌ను వేలానికి పెడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -