Sehwag-Razzak:సచిన్‌ కంటే అతన్నే విధ్వంసకరి..!

20
- Advertisement -

పాక్‌ జట్టుకు భారత్‌ అంటే చచ్చేంత భయమని ఆదేశ మాజీ ఆటగాడు ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌రజాక్‌ అన్నారు. భారత ఆటగాళ్లలో కొంతమంది అంటే మాకు చాలా వణుకు అని వారిని ఔట్‌ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేవారిమని తెలిపారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, యువరాజ్‌ సింగ్, జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్ల గురించి ప్రస్తావించారు. వీరిలో మొదట సెహ్వాగ్ అంటే భయమని అతన్ని ఔట్‌ చేసేంతవరకు మాకు చాలా టెన్షన్‌గా ఉండేదని చెప్పుకొచ్చారు.

అలాగే రెండవ స్థానంలో సచిన్‌ ఔట్ చేసేంత వరకు మా డ్రేసింగ్ రూంలో టెన్షన్‌ వాతావరణం కనిపించేదన్నారు. అయితే వీరిద్దరూ ఔట్‌ అయితే ఇక మ్యాచ్‌ సగం మేమే గెలిచినట్టుగా భావించి సంబురాలు చేసుకునేవాళమని అన్నారు. ఇక మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని రజాక్‌ పేర్కొన్నారు. వీరి కోసం మేమంతా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకొనేవాళ్లమని అన్నారు. ఇక బౌలింగ్ విషయాన్ని వస్తే జహీర్‌ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌సింగ్‌ను ఎదుర్కోవడంలో మా బ్యాటర్లు పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగేవారమని అన్నారు. బౌలింగ్ విషయంలో మాత్రం మా బ్యటర్లు ప్రత్యేకంగా సమయాత్తమయ్యేవారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి…

IPL 2023:జట్లు,కెప్టెన్లు వీరే

ఐపీఎల్‌..సర్వం సిద్ధం

ShikharDhawan:హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్న శిఖర్‌..!

- Advertisement -