పాక్ యూ ట్యూబ్ ఛానెల్స్ బ్యాన్‌

16
- Advertisement -

పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్‌కి చెందిన 16 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. హోంశాఖ సిఫార్సు మేరకు నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే పాకిస్తాన్‌ పై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. ఇక ఉగ్రదాడి తర్వాత తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, అజిత్ ధోవల్.

- Advertisement -