ఐపీఎల్‌..సర్వం సిద్ధం

48
- Advertisement -

పొట్టి క్రికెట్ లీగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.తొలి మ్యాచ్ 31న గుజరాత్ – చెన్నై మధ్య జరగనుంది. ధోనికి ఇదే చివరి సీజన్ కానున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ రాయల్స్‌ గతేడాది ఫైనల్‌కి చేరిన టైటిల్ వేటలో మాత్రం వెనుకబడిపోయింది. సంజూ శాంసన్‌ నేతృత్వంలోని ఈ జట్టు ఈసారి ఎలాగైన టైటిల్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అశ్విన్‌, బట్లర్‌తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌, యశస్వీ జైశ్వాల్‌ జట్టు విజయాల్లో భాగం పంచుకుంటున్నారు.

లఖ్నో సూపర్‌ జెయింట్స్‌… ఆరంభ సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. రాహుల్‌ కెప్టెన్సీలో ఆడిన 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి ఐదు ఓడింది. ఈసారి వేలంలో టీమ్‌లోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌, పేసర్‌ ఉనాద్కట్‌ రాణించే అవకాశం ఉంది. అలాగే టీమ్‌ లో దీపక్‌ హుడా, క్రునాల్‌ పాండ్యా, గౌతమ్‌, స్టొయినిస్‌, షెఫర్డ్‌, మేయర్స్‌లాంటి ఆల్‌రౌండర్లతో కళకళలాడుతోంది.

ఇక గత రెండు సీజన్లలోనూ నిరాశ పరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి రెచ్చిపోయి ఆడాలని పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వంలో సత్తా చాటాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది. మార్చి 31 నుంచి మే 28 వరకు 12 వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -