ఏళ్లకు ఏళ్ల పాటు తన కాల్షీట్లు మొత్తాన్ని బాహుబలి కోసం ఇచ్చేసిన ప్రభాస్.. నేషనల్ స్టార్‌గా అయిపోయాడు. బాహుబలి మొదటి పార్టు తరువాత గ్యాప్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చిన ప్రభాస్ వదులుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి కోసం దాదాపు మూడేళ్ల పాటు కండలు పెంచి. ఏకంగా 20 కిలోల బరువు పెరిగిన ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. .
ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు బుల్లి తెరపైన సందడి చేసేందుకు సిద్దమయ్యాడు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే కాఫీ విత్ కరణ్ తరహాలో నెం 1 యారి టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా. ఆసక్తికరమైన విశేషాలతో ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై ఫ్యాన్స్ లో మంచి జోష్ తెచ్చింది.
ఇటీవల ఈ షో నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఇందులో బాహుబలి దర్శకుడు రాజమౌళీ, నిర్మాత శోభు ఉన్నారు. ఈ సంధర్బంగా రాజమౌళీ ప్రభాస్‌కు ఫోన్ చేసి అర్జెంటుగా కలుద్దామంటాడు. ఎందుకు డాలింగ్ అని ప్రభాస్ అడగ్గా.. బాహుబలి పార్ట్ 3 అనగానే.. షాకైన ప్రభాస్.. అమ్మానీ యమ్మా..(నవ్వుతూ..) అంటూ రియాక్షన్ ఇవ్వడంతో రాజమౌళి, రానాలు నవ్వు ఆపుకోవడం కనిపిస్తుంది ఇందులో. అయితే ప్రభాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో కనపడలేదు. మరీ జూన్ 25 నుండి ప్రారంభమవుతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో మీరు ఓసారి చూడండి..
https://youtu.be/SZivYHzCNOA