బాహుబ‌లి 3లో హాలీవుడ్‌ హీరో..!

235
Samuel L Jackson
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

జ‌పాన్‌, చైనా వంటి దేశాల‌లోని సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమాను త‌మ సినిమాగా ఓన్ చేసుకొని ఘన విజ‌యం అందించారు. అయితే ఇంత ఘ‌న విజ‌యం సాధించిన ఈ సిరీస్‌లో మూడో పార్ట్ తీస్తే బాగుంటుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ డైరెక్టర్‌ రాజ‌మౌళి మాత్రం ప్రస్తుతం ఆలాంటి ఆలోచ‌న లేద‌ని చాలా సంద్భాల్లో చెప్పారు.

Baahubali 3

ఇక అసలు విషయం ఏంటంటే.. హాలీవుడ్‌లో ‘అవెంజర్స్‌’ మూవీ అందరికి తెలిసిందే. ఇందులో నిక్‌ ఫ్యూరీ పాత్ర పోషించిన జాక్సన్ త‌న నెక్ట్స్‌ మూవీ ‘అవెంజర్స్‌: కెప్టెన్ మార్వెల్‌’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా జాక్సన్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇండియాకి వెళ్తారా అని ప్ర‌శ్నించ‌గా, పని క‌లిపిస్తే వెళ‌తా అని అన్నాడు. ఇక బాలీవుడ్‌లో ఏదైన సినిమా చేయాల‌నుకుంటున్నారా అని అడ‌గ్గా.. బాహుబ‌లి 3 చిత్రం కోసం ప‌నిచేయాల‌ని ఉంద‌ని తెలిపారు. దీంతో బాహుబ‌లి 3 మ‌రో సారి వార్తలో నిలిచింది. మరి దర్శకుడు రాజ‌మౌళి బాహుబ‌లి 3 తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -