కుర్ర దర్శకుడి పై తప్పుడు వార్తలు

46
- Advertisement -

ఓ యుంగ్ డైరెక్టర్ తన భార్యతో విడిపోతున్నాడు అంటూ వార్తలను వైరల్ చేశారు. ఊరు పేరు రాకుండా యువ జంట అంటూ ఈ పుకార్లను రాసుకొచ్చారు. అసలు రాను రాను సోషల్ మీడియాలో కొందరికి సృహ లేకుండా పోతుంది. సున్నితమైన అంశాల పై కూడా కనీస సోయి లేకుండా పోస్టలని వైరల్ చేస్తున్నారు. ఫలానా యంగ్ డైరెక్టర్ అనగానే అందరూ దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓడెలా మీద పడ్డారు. ఏమైంది ? ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోతున్నారు ? అంటూ అతనికి ఫోన్ లు చేస్తున్నారట. నిజానికి శ్రీకాంత్ ఓడెలా తన భార్యతో చాలా అన్యోన్యంగా ఉంటున్నాడు.

అలాంటిది తనకు తన భార్యకు ఈ సోషల్ మీడియా వార్తలు విడాకులు మంజూరు చేశాయి అని ప్రతి ఒక్కరికీ చెప్పుకోలేక తెగ ఇదైపోతున్నాడు. పాపం శ్రీకాంత్ ఓడెలా పెళ్లి అయ్యి ఏడాది అవుతుందో లేదో అంతలోనే తన సంసారం జీవితంలో అనేక గాసిప్ లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి ఓ తప్పుడు ప్రచారం చాలా మందిని కలవర పెడుతుంది. పైగా తమ పై తప్పుడు వార్తలు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌ అయితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ముందు వెనుక చూడకుండా కొందరు రిప్ మెసేజులు కూడా పెట్టేస్తుంటారు.

Also Read:పుష్పరాజ్‌ గోరు వెనుక కథ అదే

అలాంటి వారందరూ ఒకసారి ఆలోచించాలి. అలాగే కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఫలానా వార్తను రాసే ముందు అందులో నిజానిజాలను కనుక్కుని రాయాలి. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు నిజానిజాలు తెలుసుకోరా ? అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓడెలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు ప్రచారం కుటుంబ సభ్యులను చాలా తీవ్రంగా బాధ పెడతాయి.

Also Read:సలార్ డిజిటల్ పార్ట్‌నర్ ఫిక్స్!

- Advertisement -