సలార్ డిజిటల్ పార్ట్‌నర్ ఫిక్స్!

33
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 28న విడుదల అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించినా వాయిదా పడింది. అన్నికున్నట్లు జరిగితే జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

సలార్‌తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో స్పిరిట్, దర్శకుడు మారుతీతో ఒక చిత్రం నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి.

Also Read:Jawan:ఐదురోజుల వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -