సమాచారం అడిగితే కండోమ్‌లు పంపారు!

157
RTI applicants receive condoms

ఆర్టీఐ.. సమాచార హక్కు చట్టం సామాన్యుడి ఆయుధం.అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ చట్టం ద్వారా సమాచారం అడిగిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

మోహన్ లాల్, వికాశ్ చౌదరీ అనే ఇద్దరు ఆర్టీఐ ఉద్యమకారులు తమ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాచారం తదితర వివరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి ఉహించని సమాచారం అందింది.

సమాచారం అడిగిన ఆ ఇద్దరికి కవర్లో కండోమ్‌లు, న్యూస్ పేపర్లను పంపారు. దీంతో ఆ ఉద్యమకారులు ఆర్టీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని భద్రా తెహసిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.