బాబోయ్.. మహేష్ బాబు 90 కోట్లు

19
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ల పై ఎప్పుడూ నెగిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. దీనికితోడు రాను రాను టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు టాప్ లేచిపోయే రేంజ్ కు వెళ్లిపోతుండటం పై నిర్మాతలు కూడా లోలోపల బాధతో కుమిలిపోతున్నారు. లోపల కోపం రగిలిపోతున్నా.. పైకి చిరునవ్వుతో కనిపించడానికి నిర్మాతలు తెగ ఇదైపోతున్నారు. సహజంగా బాలీవుడ్ స్టార్ హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఉంటాయి. ఐతే, ఈ మధ్య ఒక్క హిందీనాట మాత్రమే కాదు. తెలుగునాట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు 80 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని ఆ మధ్యే వార్తలు బాగా వినిపించాయి.

ఇప్పుడు మహేష్ తన రికార్డును తనే బ్రేక్ చేస్తున్నారని బోగట్టా. గుంటూరు కారం సినిమాను మహేష్ 90 కోట్ల రెమ్యూనిరేషన్ ను అడుగుతున్నారట. షూటింగ్ పోస్ట్ ఫోన్ అవుతూ రావడం, అదనపు డేట్లు కేటాయించి రావడం.. దీనికితోడు సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ ను కూడా నిర్మాతలు తగ్గించడంతో.. మహేష్ పది కోట్లు అదనపు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశాడని టాక్. అందుకు నిర్మాతలు చినబాబు, నాగవంశీ కూడా ఓకె చేసారని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అదేంటో మొదటి నుంచీ ఈ ‘గుంటూరు కారం’ సినిమాకు ఏదొక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.

అసలు త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేయడానికి మహేష్ చాలా ఆసక్తిగా ఎదురుచూశాడు. త్రివిక్రమ్ కూడా మహేష్ అడగానే ఓకె చేశాడు. హారిక హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ కి ఏకంగా ఈ సంస్థ 70 కోట్లు రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసింది. మహేష్ తో సినిమా చేస్తే, హిట్, ఫ్లాప్, యావరేజ్ అనే విషయంతో సంబంధం లేకుండా మంచి లాభాలు వస్తాయి. అందుకే.. మహేష్ కూడా 80 కోట్లు అడిగాడు. ఇప్పుడు మహేష్ రెమ్యూనిరేషన్ అంతకు అంతా పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం 90 కోట్లకు చేరింది. మరి చివరకు ఈ రెమ్యూనరేషన్ ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Also Read:ఆ ఇద్దరితో ‘బేబీ’ బ్యూటీ రొమాన్స్

- Advertisement -