అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వీలులేకుండా ఎన్నికల కమిషన్ నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షలే ఖర్చు పెట్టాలని, అంతకు మించి పెట్టడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు ఖర్చుకు సంబంధించిన వివరాలను సమర్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
(ప్రమాణ స్వీకారానికి హరీష్‌రావు ఎలా వచ్చాడో చూడండి..https://goo.gl/AyWJva)
తన ఎన్నికల ఖర్చు రూ. 7 లక్షల 75 వేలు అని ఈసీకి వివరాలను అందించారు. ఇక కొడంగల్ నుండి పోటీచేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రూ. 7 లక్షల 44 వేలు,పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.15.33,ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తన ఎన్నికల ఖర్చు రూ. 12 లక్షల 97 వేలుగా పేర్కొన్నారు.
(మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం కేసీఆర్ ఎంట్రీ..https://goo.gl/yC1j9d)
అత్యధికంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ర 23 లక్షల 92 వేలు ఖర్చుగా పేర్కొనగా తర్వాతి స్థానంలో సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. 23 లక్షల 31 వేలు ఖర్చుగా పేర్కొన్నారు.
ఎన్నికల్లో నిర్దేశించిన మొత్తానికంటే ఎక్కువగా వ్యయం చేయడానికి వీల్లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎన్నికల వ్యయం కోసం ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరిచేలా ఏర్పాట్లుచేసింది.