ఎమోషనలైన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌

75
- Advertisement -

హాలీవుడ్ నటుడు, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో స్కాట్ దొరగా నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించిన రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు. రే స్టీవెన్‌సన్ వయసు 58 సంవత్సరాలు. ఎంతో ఫిట్ గా ఉండే రే స్టీవెన్‌సన్ ఇలా సడెన్ ఎలా చనిపోయారు ? అంటూ ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అయితే, రే స్టీవెన్‌సన్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 1942 మే 25న ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో రే స్టీవెన్‌సన్ జన్మించారు. పలు టీవీషోలు, సినిమాల్లో నటించి రే స్టీవెన్‌సన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే, పనిషర్ వార్ జోన్, ది థియరీ ఆఫ్ ఫ్లైట్ లాంటి చిత్రాలతో రే స్టీవెన్‌సన్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ ఐరీష్ నటుడు రే స్టీవెన్‌సన్ మృతిచెందడం తమను షాక్‌కు గురిచేసిందని RRR టీం ట్విటర్ వేదికగా తెలిపింది.

‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లోని మా అందరికీ ఇది షాకింగ్ న్యూస్. Rest in peace, రే స్టీవెన్ సన్. మీరు మా హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు.. SIR SCOTT’ అని ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలో స్కాట్ దొరగా నటించిన స్టీవెన్సన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘స్టీవెన్సన్ మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయనతో పనిచేయడం నాకు గొప్ప అనుభవం. వారి ఆత్మకు శాంతి శాంతి చేకూరాలి’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..చంద్రమోహన్

దర్శకధీరుడు రాజమౌళి కూడా స్టీవెన్‌సన్ మృతి పై స్పందిస్తూ… ‘ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరిగే సమయంలో అప్పుడు ఆయన వయసు 56 ఏళ్లు. అయినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా సులభంగా స్టంట్ చేశారు. సెట్స్‌లోని ఆయన జ్ఞాపకాలను మేం ఎప్పటికీ గుర్తించుకుంటాం’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ నటుడు మృతికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయింది.

Also Read:Rajinikanth:మంచి మిత్రుడిని కోల్పోయా

- Advertisement -