ఎన్టీఆర్ బర్త్ డే..నీల్ ట్రీట్!

19
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌(Jr NTR)కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్(Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. కెజియ‌ఫ్‌, స‌లార్ చిత్రాల త‌ర్వాత నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను పెట్టారు.

ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో నీల్ స్టార్ట్ చేయగా కొన్ని రోజుల్లో తారక్ కూడా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.

Also Read:కేసీఆర్ సంకల్పాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్!

సలార్ మాదిరిగానే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు ఫస్ట్ పోస్టర్‌ని త్వరలోనే అందించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా మేలో తారక్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్‌గా అందించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -